అమలా సంఘం అధ్యక్ష, కార్యదర్శి పోస్టులు ఏకగ్రీసీ
జయపురం: అఖిల ఒడిశా అమలా సంఘం కొరాపుట్ జిల్లా శాఖకు జరగనున్న ఎన్నికలకు ఆదివారంతో నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఒక్కక్క నామినేష్ దాఖలు కావటంతో వారు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం స్థానిక యాదవ భవనంలో సంఘ ఎన్నికల అధికారి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు నామినేషన్లు స్వీకరించగా.. అధ్యక్ష పదవికి సంఘ సీనియర్ కార్యకర్త, అటవీ విభాగ ఉద్యోగి జగన్నాథ్ మఝి, కార్యదర్శి పదవికి శిక్షా విభాగ ఉద్యోగి గజేంద్రచౌదరి, కోశాధికారి పదవికి శిక్షా విభాగ ఉద్యోగి నాగేశ్వరరావులు మాత్రమే నామినేషన్లు వేశారు. వీటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు పోటీగా మరెవరూ నామినేషన్లు వేయనందున ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటించారు. మరో రెండు పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉందని.. త్వరలోనే వాటికోసం ఎన్నికల తేదీ ప్రకటిస్తామని ఎన్నికల కమిటీ వెల్లడించింది.
అమలా సంఘం అధ్యక్ష, కార్యదర్శి పోస్టులు ఏకగ్రీసీ


