కళాకారుల్లో నూతనోత్సాహం
● ముగిసిన అమ్రిత్ కాల్ కల్చరల్ కాన్‌క్లేవ్
రాయగడ: జిల్లా యంత్రాంగం సహకారంతొ కోల్‌కత్తాకు చెందిన సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక బీజు పట్నాయక్ ఆడిటోరియంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ యాంకర్, కళాకారిణి బిదీషా సతపతి హాజరయ్యారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కళాకారులను ప్రోత్సాహించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో కొత్త పుంతలకు దారి తీస్తోందని ఆభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. జిల్లాలోని డొంగిరియా, లంజియాసవర, ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన కళాకారులకు నిర్వాహకులు సన్మానించారు.


