క్వారీల బంద్
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్రా సమితిలో అనుమతులు లేకుండా నడుపుడుతున్న క్రషర్, రాళ్ల క్వారీలను అధికారులు బంద్ చేయించారు. కుంద్ర సమితి బానువగుడ పంచాయతీలో నువాగుడ క్రషర్ యూనిట్, పుపుగాం పతర్ క్వారీలను (రాళ్లక్వారీ) అధికారులు సందర్శించి బంద్ చేయించారు. ఆ ప్రాంత ప్రజల ఫిర్యాదు మేరకు శనివారం జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, అకస్మాత్తుగా వెళ్లి లీజ్ అనుమతి కాగితాలను అడిగారు. తారాతరణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని ఎటువంటి లీజ్ డాక్యుమెంట్స్ చూపించలేకపోయారు. అందువలన చట్ట వ్యతిరేకంగా క్రషర్ నడుపుతున్నట్లు వెల్లడైంది. సబ్‌కలెక్టర్‌తోపాటు జూనియర్ మైనింగ్ ఆఫీసర్ శౌమ్యరంజన్ సాహు, తహసీల్దార్ బినోద్ కుమార్ నాయక్, రెవెన్యూ సూపర్‌వైజర్ బీరేంద్ర మండల్, మొసిగాం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భబాణీ భొత్ర, పోలీసు అధికారి అశ్విణీకుమార్ పట్నాయక్ సమక్షంలో క్వారీ చట్ట విరుద్దమని ప్రకటించారు. క్వారీ, క్రషర్‌ల చుట్టూ ఎర్ర జెండాలు పాతించారు. క్వారీ, క్రషర్‌లలో వినియోగించే సామగ్రి, మినీక్రషర్ మిషన్‌ను అధికారులు సీజ్ చేశారు. వాటిని ఆ కంపెనీ యజమాని సోమనాత్ పాత్రో జిమాలో ఉంచారు.


