పెన్షన్‌దారుడు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ ఇస్తారా..?
జయపురం: ఒక పెన్సన్‌దారుడు మరణిస్తే గానీ మరొకరికి పెన్షన్ లభించదా? అని ప్రముఖ సమాజసేవి బి.హరి రావు ప్రశ్నించారు. 60 ఏళ్లు నిండిన ప్రతివారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అనేకమంది అర్హులు ధరఖాస్తులు పెట్టుకున్నా పెన్షన్ మంజూరు చేయటం లేదని ఆరోపించారు. కొంతమంది వృద్ధులతో జయపురండిప్యూటీ కలెక్టర్ నమ్రత గర్తియకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వృద్ధులు కేశవ జాని, రామ ముదులి, బలరాం జాని, బుదు హంతాల్, తదితరులు పాల్గొన్నారు.


