కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయం
రాయగడ: కళలకు పుట్టినిళ్లుగా బాసిళ్లుతున్న రాష్ట్రంలోని కళాకారులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కోల్‌కతాకు చెందిన సాంస్కృతిక విభాగం అమ్రిత్ కాల్ కల్చరల్ కాన్‌క్లేవ్ పేరిట స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కళాకారులను ప్రొత్సాహించి వారిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకువచ్చేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ వేదికను కళాకారులు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్ మాట్లాడుతూ.. ఈ కాన్‌క్లేవ్ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేదికపై తమ ప్రతిభను కనబరిచేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. కోల్‌కతాకు చెందిన సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని అన్నారు. రెండు రోజులు జరిగే కార్యక్రమంలొ కళాకారులు తమ సత్తాను చాటుకోవాలని అన్నారు. కోల్‌కతాకు చెందిన సాంస్కృతిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ క్రిష్ణ సరోజ్ మాట్లాడుతూ.. రాష్ట్రం కళలకు ప్రసిద్ధిగా గుర్తింపు పొందిందని అన్నారు. ఒడిస్సీ నృత్యం అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకోవడం విశేషమని అభిప్రాయపడ్డారు. కళాకారులను ప్రొత్సాహించడమే కార్యక్రమం ముఖ్యఉద్దేశమన్నారు.
గురువులకు సన్మానం
జిల్లాలో ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్న గురువులను ఈ సందర్భంగా సాంస్కృతిక విభాగం సన్మానించింది. మా సంతోషి కళా ప్రతిష్టాన్‌కు చెందిన గురువు సంతోష్ కుమార్ తండి, గుణుపూర్ సబ్ డివిజన్‌లోని పుటాసింగ్ ప్రాంతానికి చెందిన లంజియా సవర నృత్య గురువు వీరభధ్ర దొలొబెహర, మా మజ్జిగౌరి డ్యాన్స్ డ్యాన్స్ బృందానికి చెందిన గురువు టి.శివ భాస్కర్, పీడీసీ డ్యాన్స్ బృందానికి చెందిన గుప్తేశ్వర్ సిక్క, మా మార్కమా నాట్య కళా సంఘటన్‌కు చెందిన మధుసూదన్ మహాపాత్రో, రాయగడ సేవా సమాజ్‌కు చెందిన దీప్తి మడమను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టే థింశా నృత్యం, వారి ఆచార వ్యవహారాలు, పూజా విధానాలు తెలిపే నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అలాగే సంబల్‌పూరి నృత్యం ఆకట్టుకుంది.
కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయం
కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయం
కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయం
కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయం


