పర్లాకిమిడి: గజపతి జిల్లా స్థాయిలో స్థానిక బిజూ కల్యాణ మండపంలో జరిగిన యువజనోత్సవాలు శనివారం ముగిశాయి. ఏడీఎం, ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. వికసిత్ భారత్ యువజనోత్సవాలలో జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్‌లు పాల్గొని మాట్లాడారు. తొలుత జానపద గీతాలు పాడారు. తదనంతరం జానపద డ్యాన్సుల పోటీలు జరిగాయి.
విజేతలు వీరే..
ఈ ఫోక్ సాంగ్స్ పోటీలో ప్రథమ బహుమతి క్రియేటివ్ ఆర్ట్స్ రూ.10వేలు, ద్వితీయ ఏ.జె.క్య్రూ డ్యాన్స్ స్టూడియోకు రూ.7,500, తృతీయ ప్రభుత్వ పీఎంశ్రీ ఉన్నత పాఠశాల, ఆర్.ఉదయగిరి (బలియా సాహి) గెలుచుకున్నారు. అలాగే జానపద నృత్యాల పోటీలో ప్రథమ బహుమతి క్రియేటివ్ ఆర్ట్స్ రూ.10వేలు, ద్వితీయ సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ రూ7,500, తృతీయ బహుమతిని వందేమాతరం టాలెంట్ అకాడమీకి రూ. 5 వేల బహుమతిని ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ అందజేశారు. ఇవికాక, పోయిట్రీ, పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్ వంటి వివిధ పోటీలలో పాటు విజ్ఞాన ప్రదర్శనలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు పదివేల రూపాయలు బహుమతిని అందజేశారు. ప్రథమ బహుమతిని అందుకున్న విజేతలకు రాష్ట్ర స్థాయిలో భువనేశ్వర్‌లో జరుగనున్న పోటీలకు పంపిస్తామని జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు తెలిపారు.
ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు
ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు
ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు
ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు
ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు
ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు


