యువతకు లోతైన సాహితీ పరిజ్ఞానం అవసరం: జావేద్ అక్తర్
భువనేశ్వర్: యువతకు లోతైన సాహితీ పరిజ్ఞానం అవసరమని, యువత సాహిత్యం, భాష, సంస్కృతి, సంప్రదాయాలపట్ల మక్కువతో పట్టు సాధించాలని ప్రముఖ కవి, గేయ రచయిత, సాహిత్య రచయిత పద్మభూషణ్ జావేద్ అక్తర్ ప్రోత్సహించారు. ఈ విషయాలను ఎంత ఎక్కువగా అన్వేషిస్తే అవగాహన అంత గొప్పగా తళుక్కుమంటుందన్నారు. ఆయన తొలి ఎస్‌ఓఏ సాహిత్య సమ్మాన్ – 2025 పురస్కార గ్రహీతగా శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో న్యూఢిలీ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఎస్‌ఓఏ ఉపాధ్యక్షురాలు శాస్వతి దాస్ మరియు ఎస్‌ఓఏ వైస్ చాన్స్‌లర్ ప్రదీప్త కుమార్ నందా, ఎస్‌ఓఏ సాహిత్య ఉత్సవ డైరెక్టర్ గాయత్రిబాల పండా, ఎస్‌ఓఏ డీన్ జ్యోతి రంజన్ దాస్ తదితరులు ప్రసంగించారు.


