ఇద్దరు కళాకారులకు సంగీత అకాడమి పురస్కారాలు
జయపురం: జయపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు కళాకారులు కళారంగానికి అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర సంగీత ఏకాడమి అవార్డులతో సన్మానించింది. సంగీత అకాడమి సన్మానించిన కళాకారులు జయపురంలో ఒడిస్సీ నృత్యకళా సంస్థను నెలకొల్పి కొరాపుట్ జిల్లాలో ఒడిస్సీ నృత్య కళను విస్తరింప చేస్తున్న ప్రముఖ నృత్యకారుడు కనూచరణ్ ప్రధాన్, సంగీత అకాడమీ చే సన్మానించబడ్డారు. అలాగే మరుగున పడుతున్న లోక కళా భజన సంకీర్తనలు పునరుద్ధరణకు ఎనలేని కృషి చేస్తున్న లింగరాజ్ నిశంకను కూడా సంగీత అకాడమి అవార్డులతో సత్కరించింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోక్ సేవా భవనంలో నిర్వహించబడిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సూర్యవంశీ సూరజ్, ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో, బాబు సింహ, ఆకాశ దాస్ నాయిక్, సంబంధిత విభాగ కార్యదర్శి డాక్టర్ విజయ కేతన్ ఉపాధ్యాయ, స్వతంత్ర పాలన కార్యదర్శి దేవ ప్రసాద్ దాస్, సంగీత నాటక అకాడమి కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖరహాత్త లు కళాకారులకు శాలువలు కప్పి ప్రశంసా పత్రాలతో పాటు ఒక లక్ష రూపాయల చొప్పున సత్కరించారు.
ఇద్దరు కళాకారులకు సంగీత అకాడమి పురస్కారాలు


