మంత్రుల పరామర్శ
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతిని భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో మంత్రులు పరామర్శించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూరజ్ సూర్యవంశీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ కుమార్ ప్రధాన్ తదితరులు పరామర్శించారు. మరోవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా అసెంబ్లీలో ఆరుగురు సీనియర్ ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కార్యక్రమంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. త్వరలో కొరాపుట్ జిల్లాకి వస్తానని రాష్ట్రపతి చెప్పారని బాహిణీపతి ప్రకటించారు.


