టెక్కలి డివిజన్‌కు నందిగాం
● అభ్యంతరాలుంటే తెలపాలి : కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం, నందిగాం మండలాన్ని ప్రస్తుతం ఉన్న పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్‌కు మారుస్తూ కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పుండ్కర్ ప్రాథమిక నోటిఫికేషన్ (జీవోఆర్టీ.1490) జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే, గెజిట్ ప్రచురణ అయిన తేదీ (27.11.2025) నుంచి 30 రోజుల్లోపు రాతపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన కంబకాయ యువకుడు
నరసన్నపేట: కంబకాయకు చెందిన పాగోటి సతీష్ అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌లోని పటాయ్ పట్టణంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీ ల్లో సత్తా చాటి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ యునైటెడ్ వరల్డ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్(యూడబ్ల్యూఎస్‌ఎఫ్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఆసియా స్థాయి లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన పోటీలో సతీష్ ప్రతిభ చూపి మూడో స్థానంలో నిలిచారు. సుమారు 20 దేశాల నుంచి 18 మంది పోటీల్లో పాల్గొనగా తనకు కాంస్య పతకం దక్కిందని ఆయన తెలిపారు. దీనిపై సర్పంచ్ పాగోటి కుసుమ కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరి సతీష్‌కు అభినందనలు తెలిపారు.
రైతును నట్టేట ముంచుతున్నారు
● ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపాటు
నరసన్నపేట: బాబు సర్కారు అన్ని రకాలుగా రైతులను నష్టపరుస్తోందని, పంటను సకాలంలో కొనుగోలు చేయకుండా దగాకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పండిన ధా న్యం అమ్ముకోవడానికి అనేక ఆంక్షలు పెడుతోందన్నారు. చంద్రబాబు నిజస్వరూపం చూ పుతున్నారని అన్నారు. టమాటా, ఉల్లి, అరటి, మిరప పంటలకు మద్దతు ధర కల్పించలేక పోయిన ప్రభుత్వం ఇప్పుడు వరి ధాన్యం అ మ్మకాల వద్దకు వచ్చే సరికి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సక్రమంగా ధాన్యం కొనుగో లు చేయక దళారులకు అమ్ముకొనే విధంగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కొనుగో లు కేంద్రాల ఏర్పాటు, ఏజెన్సీల నియామకంలో కూడా రాజకీయం చేస్తూ రైతులకు కష్టాలకు గురి చేస్తుందన్నారు. రైతులకు నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చని అంటూ కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులను పట్టించుకోవడం లేదని, షెడ్యూల్ ఇవ్వడం లేదని, ట్రక్ షీట్ జనరేట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వ మని అన్నారు. గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారని, రైతులు బయట కొనుగోలు చేసి నష్టపోతున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో, ధాన్యం నాణ్యత పేరుతో దళారులు రైతులను మోసం చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు ఆదుకోవాలని, ధాన్యం అమ్మకాల విషయంలో పూర్తిగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల పక్షాన ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
వాహనాలపై స్పెషల్ డ్రైవ్
శ్రీకాకుళం రూరల్: జిల్లాలో గల స్కూల్, కాలేజ్‌లకు చెందిన పలు వాహనాలపై విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు శుక్రవారం నుంచి డిసెంబర్ 4వరకూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్ చేస్తున్నట్లు ఉపరవాణాశాఖాధికారి విజయసారధి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 41 వాహనాలను తనిఖీలు చేసి నోటీసులు అందించినట్లు తెలిపారు.
టెక్కలి డివిజన్‌కు నందిగాం
టెక్కలి డివిజన్‌కు నందిగాం


