క్రికెట్‌లో మున్సిపాలిటీ టీమ్ విజయం
జయపురం: కొరాపుట్ పర్వ్–2025 పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలో మున్సిపాలిటీ అకాడమీ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ పోటీ జయపురం ప్రెస్‌క్లబ్, మున్సిపాలిటీ అకాడమీ జట్ల మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జయపురం ప్రెస్‌క్లబ్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. 104 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మున్సిపాలిటీ అకాడమీ టీమ్ 9 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. పోటీలను జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్య నిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి పార్ధ గజపతి కాశ్యప్, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్‌పర్సన్ బి.సునీత తదితరులు పాల్గొన్నారు.


