ధనలక్ష్మి పూజలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో ధనలక్ష్మి పూజలు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం నాగావళి నది నుంచి శుద్ధజలాలను తీసుకువచ్చి మండపాన్ని శుద్ధి చేశారు. అనంతరం వైతరణి, దేవగిరి సంఘంలో స్థలంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొమ్మిది రోజులు ధనలక్ష్మి పూజలను నిర్వహిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. జిల్లా పరిషత్ సభ్యులు బి.వి.ప్రసాద్ రావు, కమిటీ అధ్యక్షులు కై లాస్ ఆచారి, ఉపాధ్యక్షులు కామాఓ కుమార్ పాఢి, కార్యదర్శి జి.కిరణ్‌కుమార్ తదితరుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నగరంలో బాంబు పేలుడు
భువనేశ్వర్: స్థానిక సెంట్రల్ స్కూల్–3 ముంగిట బాంబు పేలుడు బెంబేలెత్తించింది. శుక్రవారం ఉదయం గొడొకొణ ప్రాంతంలో సెంట్రల్ స్కూల్–3 ప్రధాన ద్వారం దగ్గర బాంబు పేలుడు పరిసరాలను దద్దరిల్లించింది. మంచేశ్వర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టుకు తరలించారు. రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు డీఎస్పీ ప్రవాత్ కుమార్ త్రిపాఠి, ఏఎస్‌ఐ ఎం.చంద్ర, సిబ్బంది దాడులను నిర్వహించారు. ఈ క్రమంలో ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాంలో అనుమానాస్పందంగా కనిపించిన ఓ ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది నిందితుడు జిల్లాలోని అండ్రాకంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాయికొకుఫాకల్ గ్రామానికి చెందిన అశోక్ మణి బాగ్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
క్రీడలు ఆరోగ్యదాయకం
భువనేశ్వర్: విద్యార్థి దశలో క్రీడలు యువతలో మానసిక, శారీరిక సమతుల్యతకు దోహదపడతాయి. ఈ రంగంలో పోటీలు యువతరంలో క్రీడా స్ఫూర్తిని ప్రేరేపిస్తాయని పర్లాకిమిడి నియోజక వర్గం ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రాహి తెలిపారు. స్థానిక హైటెక్ సైన్స్, కామర్స్ కళాశాల 19వ వార్షిక క్రీడోత్సవం ప్రారంభం పురస్కరించుకుని ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
గజపతి జిల్లాలో
రూపా మిశ్ర పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాను ఆకాంక్ష జిల్లాగా ప్రకటించిన తర్వాత గుమ్మా, ఆర్.ఉదయగిరి సమితుల్లో వివిధ ప్రభుత్వ పథకాలు ఎంతవరకూ అమలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి, స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా పర్యటించారు. అనంతరం పర్లాకిమిడి కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గుమ్మా, ఆర్.ఉదయగిరి బ్లాక్‌లలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక, మౌలిక సౌకర్యాలు, స్కిల్ డవలప్‌మెంట్, అమృత సరోవర యోజన, మహాత్మాగాంధీ ఉపాధి పనులు, రోడ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ, ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ అదనపు సీడీవో పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్‌పండా, సీడీఎంవో డా.మహ్మద్ ముబారక్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ధనలక్ష్మి పూజలు ప్రారంభం
ధనలక్ష్మి పూజలు ప్రారంభం
ధనలక్ష్మి పూజలు ప్రారంభం


