రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. జిల్లా్లోని రామనగుడ సమీపంలోని బంకీ కూడలిలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడు పర్వేష్ కుమార్ (32)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రామనగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు తెలిజేసిన వివరాల ప్రకారం.. రాయపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఒక లారీ (ట్రైలర్ ) నడుస్తు బంకీ కూడలిలో యాంత్రిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో ఆగిపొయింది. వెంటనే డ్రైవరు పర్వేష్ లారీ నుంచి కిందకు దిగి ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ కింద మరమ్మతులు చేస్తున్నాడు. అదే సమయంలో లారీ ఒక్కసారిగా వెనక్కు రావడంతో ఇంజన్ కింద ఉన్న డ్రైవరు లారీ చక్రం కింద పడి మృతి చెందాడు. లారీ వెనక్కు వెళ్లి బోల్తా కొట్టి సమీపంలోని లోయలోకి దూసుకుపొయింది.
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం


