● అతిథి దేవో భవ
రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి గౌరవ విందుతో ఆతిథ్యం కల్పించారు. గురువారం రాజ్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాత్రి విందులో గవర్నరు సతీమణి జయశ్రీ కంభంపాటి పాల్గొన్నారు. ఈ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక మరాండి, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జుయెల్ ఓరం, రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, అనేక మంది ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు ఇతర ప్రము ఖులు హాజరు అయ్యారు. – భువనేశ్వర్


