కుంద్రాలో డాక్టర్ల ఆందోళన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రిలో డాక్టర్లు వైద్యులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారు తమ డిమాండ్ల సాధనకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. వారం రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై డాక్టర్లు మండిపడ్డారు. డిమాండ్లు నెరవేర్చకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఒడిశా మెడికల్ సేవా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రీయ డీఎస్‌సీ హక్కు, ఒప్పందం ప్రకారం కేడర్ పునరుద్ధరణ, కేబీకే నిబంధనలు, విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ, ఆరోగ్య బీమా తదితర 18 డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. నెలాఖరు వరకు ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించక పోతే కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలిపారు. ఓపీ పూర్తిగా బంద్ చేస్తామన్నారు. డాక్టర్ దాస్‌తో పాటు డాక్టర్ దేవాశిష్ మహరాణ, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ అరవింద పండ, డాక్టర్ హరిశ్చంధ్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.


