ఉపాధ్యాయుల నిరసన
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో ఉన్న ఒడిశా ఆదర్శ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు గురువారం నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్లలు ధరించి పాఠశాల ముందు తమ నిరసను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణసింగుపూర్‌లో ఆదర్శ విద్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు సంపూర్ణంగా ప్రభుత్వ గుర్తింపు లభించలేదని, అదేవిధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది ఆదర్శ విద్యాలయాలకు కల్పిస్తున్న సౌకర్యాలను పొందడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తగు చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.
అగ్ని బాధితులకు సాయం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ డెప్పోవీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన పది ఇళ్లు దగ్ధమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు సత్యసాయి సేవా ట్రస్టు సభ్యులు సహాయాన్ని అందించారు. ట్రస్టు సభ్యులు ఈ మేరకు బుధవారం బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గ్యాస్ స్టౌ, వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సత్యసాయి ట్రస్టుకు చెందిన శివదుర్గా, పద్మన సేనాపతి, కె.ధర్మరాజు, పి.రామప్రసాద్ పి.హరిశ్చంద్ర, ఎల్.సురేష్ తదితరులు బాధితులకు సహాయం అందించిన వారిలో ఉన్నారు. అయితే బాధితులకు ఇంతవరకు ప్రభుత్వ నుంచి ఎటువంటి సహాయం అందలేదు.
91 మంది అధికారుల జీతాలు నిలిపివేత
భువనేశ్వర్ : కటక్ జిల్లాలో 91 మంది అధికారులు, సిబ్బంది జీతాలు నిలిపివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీరి పని తీరు పట్ల ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ కేంద్రం తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. బాధితుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం తేటతెల్లం కావడంతో జీతాలు నిలిపివేయాలని సిఫారసు చేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వ సేవలు కల్పించిన అధికారులు, సిబ్బంది నవంబరు నెల జీతభత్యాల చెల్లింపు నిలిపివేయాలని కలెక్టరు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు లేఖ రాశారు. జీతాలు నిలిపివేతకు గురైన వారిలో కటక్ నగర పాలక సంస్థ కమిషనర్, నగర డీసీపీ, కటక్ గ్రామీణ పోలీస్ సూపరింటెండెంట్, కటక్ సబ్ జిల్లా మేజిస్ట్రేట్, అఠొగొడొ సబ్ జిల్లా మేజిస్ట్రేట్, కటక్ ఆర్టీఓ, కటక్ జిల్లా ప్రధాన వైద్య అధికారి (సీడీఎంఓ), జిల్లా విద్యాధికారి (డీఈఓ), ట్రాఫిక్ సూపరింటెండెంట్, ట్రాఫిక్ ఇనస్పెక్టర్ ఇన్‌చార్జి ఉన్నారు.
8 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం
పర్లాకిమిడి: గజపతి, గంజాం సరిహద్దు బోడోగోడో పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్రకోట్, బరాగావ్, జైసింగ్ గ్రామాల్లో ఎకై ్సజ్, పోలీసు శాఖ, అటవీశాఖ అధికారులు గురువారం ఉమ్మడిగా దాడులు జరిపారు. అక్రమంగా పండిస్తున్న గంజాయి క్షేత్రాలను నాశనం చేసి తగులబెట్టారు. దాదాపు ఎనిమిది ఎకరాల్లో గంజాయిని పండిస్తున్నట్టు ఐఐసీ సోరడా పోలీసు ష్టేషన్ అధికారి తెలిపారు. ఎనిమిది ఎకరాల్లో పండిస్తున్న గంజాయి విలువ కోన్ని లక్షల రూపాయలు ఉంటుందని బోడోగోడో పోలీసు అధికారులు తెలియజేశారు. ఈ దాడుల్లో హింజిలికాటు, అస్కా అబ్కారీశాఖ, పోలీసులు, ధరాకోట్ ఆదనపు తహసీల్దార్, బోడోగోడో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల నిరసన


