కళింగ అతిథి నివాస్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కళింగ అతిథి నివాస్‌ ప్రారంభం

Nov 28 2025 7:18 AM | Updated on Nov 28 2025 7:18 AM

కళింగ

కళింగ అతిథి నివాస్‌ ప్రారంభం

భువనేశ్వర్‌: స్థానిక రాజ్‌ భవన్‌ సముదాయంలో సరికొత్త భవంతి కళింగ అతిథి నివాస్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. ప్రముఖులు, ప్రత్యేక సందర్శకులకు ఈ అతిథి గృహం ఆతిథ్యం కల్పిస్తుంది. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఉన్నత స్థాయి అధికారిక కార్యక్రమాలను మరింత హుందాగా నిర్వహించేందుకు ఈ గృహం సమర్ధవంతమైన సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కళింగ అతిథి నివాస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాణాల విభాగం కార్యదర్శి సంజయ్‌ సింగ్‌ భారత రాష్ట్రపతి, ఇతర విశిష్ట అతిథులకు ఈ భవంతి నిర్మాణ రూపకల్పన, ప్రాంగణ ప్రణాళిక ఇతరేతర కీలక నిర్మాణ శైలి క్రమం వివరించారు. ఈ భవనం సాంస్కృతిక సౌందర్యం మరియు ఆధునిక సౌకర్యాల మేళవింపుతో అత్యంత ఉన్నత కార్యదక్షతతో రూపుదిద్దుకుందని తెలిపారు.

కళింగ అతిథి నివాస్‌ ప్రారంభం 1
1/2

కళింగ అతిథి నివాస్‌ ప్రారంభం

కళింగ అతిథి నివాస్‌ ప్రారంభం 2
2/2

కళింగ అతిథి నివాస్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement