నడిరోడ్డుపై నాగసర్పం! | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై నాగసర్పం!

Nov 28 2025 7:18 AM | Updated on Nov 28 2025 7:18 AM

నడిరో

నడిరోడ్డుపై నాగసర్పం!

సిక్కోలు లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరణ జాతీయ పోటీలకు పాతపట్నం విద్యార్థి వర్షితకు కాంస్య పతకం

కొరాపుట్‌: నడిరోడ్డుపై నాగుపాముని చూసిన జనం భయంతో హడిలిపోయారు. కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితి కేంద్రంలోని సిమిలిగుడ రోడ్డులో ఐటీఐ కళాశాల ఎదుట గురువారం భారీ నాగుపాము పడగవిప్పి దర్శనం ఇచ్చింది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ మార్గంలో రోడ్డు మధ్యలో పాము ఉండడంతో ఇరుపక్కల వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంట తర్వాత పాము సమీప పొదలోనికి వెళ్లిపోవడంతో వాహనాలు ముందుకు కదిలాయి.

కొట్‌పాడ్‌ సమితి మాజీ అధ్యక్షుడు మృతికి సంతాపం

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌ సమితి మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌ రథ్‌ బుధవారం మృతి చెందారు. భార్య, కుమారుడు ఉన్నారు. ప్రకాశ రథ్‌ మృతి పంట్ల కాంగ్రెస్‌ నాయకులు, కొట్‌పాడ్‌ బార్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. రథో అందించిన సేవలను గుర్తు చేశారు.

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీకాకుళం పట్టణానికి చెందిన మణిపాత్రుని క్రియేటివ్‌ అకాడమీ, పీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం – 2025 లోగోను శ్రీకాకుళం నెహ్రు యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట్‌ ఉజ్వల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం యువత క్రియేటివిటీ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమన్నారు. ఈ లోగో శ్రీకాకుళం సంస్కృతి సంప్రదాయా లు, కళలు ప్రతిబింబించే విధంగా చిత్రీకరించి న ఆర్ట్‌ డైరెక్టర్‌ మణిపాత్రుని నాగేశ్వరరావుని అభినందిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, పీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్వాహ కులు ప్రసాద్‌, కుమారి, కీర్తి, అభిరామ్‌, సంజు తదితరులు పాల్గొన్నారు.

పాతపట్నం: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్స రం చదువుతున్న అంబటి గణేష్‌ రగ్బీ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై న ట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ టి.హేమసుందర్‌ తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలోని ఆదర్శ విద్యా మందిర్‌ క్రీడా మైదానంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌లో అండర్‌–19 బాలుర విభాగంలో శ్రీకాకుళం జిల్లా తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో పాతపట్నం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులుఎ.గణేష్‌, బి.ప్రసా ద్‌, పి.వంశీ, ఎస్‌.అయ్యప్పలు ఉండ డం అభి నందనీయమని ప్రిన్సిపాల్‌ అన్నారు. వీరిలో గణేష్‌ జాతీయ పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. గురువారం విద్యార్థులను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

ఎచ్చెర్ల: ఖేల్‌ ఇండియా జాతీయ క్రీడా పోటీలు వెయిట్‌ లిప్టింగ్‌ విభాగంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ క్రీడాకారిణి గుజ్జల వర్షిత కాంస్య పతకం సాధించింది. ఈనెల 24వ తేదీ నుంచి రాజస్థాన్‌లోని బికనరీలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళా కేటగిరి 69 కేజీల విభాగంలో వర్షితకు గురువారం కాంస్యం వరించింది. ఈ విజయంపై వర్సిటీ వీసీ ఆచార్య కేఆర్‌ రజనీ, రిజిస్ట్రార్‌ ఆచార్య బి.అడ్డయ్య, స్పోర్ట్స్‌ డీన్‌ డా.పి.రవికుమార్‌లు అభినందనలు తెలిపారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ధర్మశాలలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అఖిల భారత మహిళల వెయిట్‌ లిప్టింగ్‌ పోటీల్లో కూడా బీఆర్‌ఏయూ తరుపున పాల్గొని రజత పతకం సాధించింది.

నడిరోడ్డుపై నాగసర్పం! 1
1/3

నడిరోడ్డుపై నాగసర్పం!

నడిరోడ్డుపై నాగసర్పం! 2
2/3

నడిరోడ్డుపై నాగసర్పం!

నడిరోడ్డుపై నాగసర్పం! 3
3/3

నడిరోడ్డుపై నాగసర్పం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement