ఉద్యోగాలకు 70 మంది ఎంపిక
ఎచ్చెర్ల: మండలంలో చిలకపాలేంలోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ బెంగలూరు సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ క్యాంపస్ డ్రైవ్‌లో 70 మంది విద్యార్థులు ఉద్యోగాల కు ఎంపికయ్యారు. ఇక్కడ ఆన్‌లైన్ డ్రైవ్ రెండు రోజులు పాటు నిర్వహించారు. దీనిలో 150 మంది విద్యార్థులు పాల్గొనగా.. 70 మంది సెలక్టయ్యారు. కళాశాల టీపీవో డాక్టర్ బి.ప్రసాదరావు, ఎం.శ్రీని వాసనాయుడు, రమాసాయి పర్యవేక్షణలో ఎంపిక లు జరిగాయి. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను కళాశాల యాజమాన్య సభ్యులు వీఎంఎం సాయి నాథ్ రెడ్డి, కె.దుర్గా శ్రీనివాస్, పి.దుర్గాప్రసాద్‌రాజు, డి.వెంకటరావు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.టి.చంద్రశేఖర్ తదితరులు అభినందించారు.
టెక్కలి: కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస గ్రామం సమీపంలో గురువారం 104 వాహనానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. గ్రామంలో వైద్య పరీక్షల నిమిత్తం వాహనం వెళ్తుండగా, వంశధార కాలువ వద్ద ఏర్పడిన గొయ్యిలో వాహనం చక్రం ఇరుక్కుపోయింది. దీంతో సమీపంలో ఉన్న గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ట్రాక్టర్ సాయంతో వాహనాన్ని బయటకు లాగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వాహనంలో ఉన్న సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో గురువారం పాడి ఆవు ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఒక టవర్ కోసం ప్రైవేట్ వ్యక్తులు గుంతలు తవ్వి విడిచిపెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మర్రిపాడు గ్రామానికి చెందిన పాడిౖ రెతు గూడ భాస్కరరావు జీవనాధారమైన సుమారు రూ.90 వేలు విలువ గల పాడి ఆవు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ నాయకుడు గూడ ఈశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డు పక్కన తవ్వి వదిలేసిన గుంతలను వెంటనే పూడ్చాలని కోరారు.
ఉద్యోగాలకు 70 మంది ఎంపిక


