పోషక ఆహార తోటలపై శిక్షణ
జయపురం: జయపురం పూల్‌బెడలో గల ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ పౌండేషన్ కేంద్రం వారు పౌష్టిక ఆహార తోటలపై (న్యూట్రిషిన్‌ౖె గార్డెన్) రైతులకు శిక్షణ ఇస్తున్నారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 5 రకాల శిక్షణలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ శిబిరంలో జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి నుంచి 250 మంది రైతులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యానవన విభాగ డిప్యూటీ డైరెక్టర్ సుధామ్ చంద్ర బిశ్వాల్ ముఖ్యఅతిథి హాజరయ్యారు. ఎం.ఎస్ స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్‌న్ కేంద్ర కోఆర్డినేటర్ అక్షయ కుమార్ పండా పౌష్టికాహార తోటల శిక్షణ శిబిరం నిర్వహణ, ప్రధాన లక్ష్యాలను వివరించారు. కాయగూరలు, పండ్లు ప్రజలకు సమృద్ధిగా లభించాలంటే ప్రతీ రైతు పెరటి తోటలు పెంచాలని సూచించారు. ఇందుకు ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ పౌండేషన్ పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. సుధామ్ చంద్ర బిశ్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలో సంప్రదాయ వ్యవసాయానికి కొరాపుట్ జిల్లా పేరుగాంచిందన్నారు. రసాయినక ఎరువులకు బదులు కంపోస్టు, సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు.
పోషక ఆహార తోటలపై శిక్షణ


