దట్టంగా పొగమంచు
పర్లాకిమిడి: జిల్లాలోని కాశీనగర్, గుమ్మా, పర్లాకిమిడి పట్టణంలో బుధవారం ఉదయం దట్టమైన మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రాయఘడ బ్లాక్ ఘాట్ సెక్షన్ మర్లబలోవాహనాలు లైట్ల సహయంతో నడిపారు. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇటువంటి వాతావరణం ఏర్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.
మంగుళి మృతదేహం లభ్యం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి కర్తన్‌పల్లి పంచాయతీ సమీపంలో ఉన్న శబరి నదీలో మంగళవారం ఉదయం మంగుళి భూమియా అనే మహిళ మునిగిపోయిన విషయం విధితమే. బుధవారం మధ్యహ్నం మృతదేహం లభ్యమైంది. నదీలో అగ్నిమాపక బృందం ఎంతో శ్రమపడి మంగుళి భూమియా (60) మృతదేహాన్ని బయటకుతీశారు. మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రదాన్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. ప్రమాదశత్తు మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఐఐసీ తెలిపారు.
దట్టంగా పొగమంచు


