కిసాన్ మోర్చా ఆందోళన
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో పలు సమస్యలపై కిసాన్ మోర్చా సభ్యులు బుధవారం ఆందోళన చేపట్టారు. గుణుపూర్‌లోని కొత్త బస్టాండ్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సమస్యలకు సంబంధించి సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకపక్ష కార్మిక నియమావళిని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో సీపీఐ (ఎంఎల్ ) జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమంగో పాల్గొని తన మద్దతును ప్రకటించారు. ప్రతీ కార్మికుడు పది గంటల కాలం పనులు చేస్తున్నాడని, దానిని రద్దు చేసి 8 గంటల కార్మిక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు పండిస్తున్న అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఆందోళనలో కిషాన్ మోర్చ నాయకులు నిరంజన్ నిమల, సంభార్ సబర్, బుద్ధదేవ్ సబర్, తులసీ నిమల, రమేష్ గంట, ముతుకా త్రిపాఠి, పార్వతీ సబర్ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ మోర్చా ఆందోళన


