పర్లాకిమిడి: గజపతి జిల్లాను బాల్య వివాహాల విముక్తి జిల్లాగా 2013లో అప్పటి కలెక్టర్ ప్రకటించారని, అయితే అడపాదడపా బాల్య వివాహాలు జరుగుతున్న ఘటనలు బయటకు వస్తున్నాయని జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి అరుణ్‌కుమార్ త్రిపాఠి అన్నారు. స్థానిక సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ కాన్ఫరెన్సు హాలులో బుధవారం జిల్లాస్థాయి స్టేక్ హోల్డర్స్ (సహాయక కర్మి) బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. బాల్య వివాహాలు అరికట్టడానికి అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, ఎన్జీవో సంఘాలు వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎన్జీవో సంఘాల సహకారంతో బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రయత్నించాలని మహిళా గ్రూపులను కోరారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సరళ పాత్రో, సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీకుమార్ మహాపాత్రో, ఆదర్శ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ గిరిజా కుమారి పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు నిర్మూలించాలి


