అఖిలపక్ష సమావేశం
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ శీతాకాలం సమావేశాలు ఆరంభం పురస్కరించుకుని ఒక రోజు ముందుగా బుధవారం అఖిల పక్ష సమావేశం జరిగింది. స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, శాసన సభ వ్యవహారాల మంత్రి ముఖేష్ మహాలింగ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్, ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రామచంద్ర కదమ్ వంటి కీలక నాయకులు హాజరయ్యారు. అధికార, విపక్షాలకు సభలో సమాన సమయం కేటాయించాలని స్పీకర్‌కు అభ్యర్థించారు. శీతా కాలం సమావేశాలు ఆద్యంతం సజావుగా, క్రమశిక్షణతో కొనసాగాలని స్పీకరు అఖిల పక్ష సభ్యులను అభ్యర్థించారు. ప్రధానంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంపై బాధ్యతాయుతంగా మెసలుకోవాలని హితవు పలికారు. సమావేశాల తొలి రోజున సభలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రెండో రోజు నవంబర్ 28న 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి అనుబంధ వ్యయ ప్రకటన (బడ్జెట్)ను సభలో ప్రవేశపెట్టనున్నారు.


