ట్యాంకర్‌ను ఢీకొన్న బొలేరో | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ను ఢీకొన్న బొలేరో

Nov 26 2025 6:07 AM | Updated on Nov 26 2025 6:07 AM

ట్యాం

ట్యాంకర్‌ను ఢీకొన్న బొలేరో

● ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం

భువనేశ్వర్‌: కటక్‌ టంగి ప్రాంతం 16వ నంబర్‌ జాతీయ రహదారి రాజొకొనా చౌరస్తా సమీపంలో మంగళవారం వేకువజామున బొలేరో అదుపు తప్పి ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కటక్‌ వైపు వెళ్తుండగా అదుపుతప్పిన బొలేరో డివైడర్‌ను దాటి ఎదురుగా ఉన్న రోడ్డులో నిలబడి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, మరో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరిని కటక్‌లోని ఎస్సీబీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ట్యాంకర్‌ను ఢీకొన్న బొలేరో 1
1/1

ట్యాంకర్‌ను ఢీకొన్న బొలేరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement