కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మాహత్యాయత్నం
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో తమిళ క్యాంప్ కూడలి వద్ద నివాసముంటున్న మాధురి కచిం అనే మహిళ భర్తతో గొడవ పడి కోపంతో ఇంట్లో కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన మహిళ భర్త నరేంద్ర కచం ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలను ఆర్పారు. అనంతరం గాయాలపాలైన ఆమెను అంబులెన్స్ ద్వారా మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందజేస్తున్నారు. మంటలు ఆర్పే సమయంలో భర్త నరేంద్ర రెండు చేతులు కూడా కాలిపోయాయి. మాధురి శరీరం 80 శాతం కాలిపోయింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.


