నూతన విద్యార్థులకు స్వాగతం
భువనేశ్వర్: స్థానిక హైటెక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ 21వ కొత్త బ్యాచ్ వైద్య విద్యార్థులకు అధికార వర్గం ఆప్యాయంగా స్వాగతించింది. ఈ సందర్భంగా నిర్వహించిన నిరాడంబర కార్యక్రమంలో హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌తో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. కొత్త విద్యార్థుల స్వాగత కార్యక్రమానికి సీనియర్ పోలీస్ అధికారి, ఒడిశా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాంశు కుమార్ షడంగి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.


