విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి
రాయగడ: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నించాలని గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో అన్నారు. గుణుపూర్‌లోని ఏకలవ్య ఆదర్శ విద్యాలయంలో మంగళవారం జరిగిన సర్గీఫూల్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల మధ్య వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఉత్సవాల్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్, పద్మపూర్ సమితి అధ్యక్షుడు మణిమాల సబర్, ఏకలవ్య ఆదర్శ విద్యాలయం హెచ్‌ఎం అనంత త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.


