నదిలో మహిళ గల్లంతు
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి కర్తన్‌పల్లి పంచాయతీకి చెందిన మంగుళి భుమియా అనే మహిళ గ్రామంలోని మహిళలతో కలిసి మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం శబరి నది గట్టు వైపు వెళ్లారు. అయితే దురదృష్టావశాత్తు ఆమె కాలుజారి నదిలో పడిపోయారు. దీంతో వెంటనే తోటి మహిళలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నటువంటి పురుషులు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వెంటనే మత్తిలి అగ్నిమాపక అధికారి రేణుబాల దీశారికి సమాచారం ఇచ్చారు. వారి వచ్చి సహాయక చర్యలు చేపట్టినా ఆచూకీ తెలియలేదు. చీకటి పడిపోవడంతో గాలింపు చర్యలకు అవాంతరం ఏర్పడింది.


