ఉత్సాహంగా కొరాపుట్ పర్వ్
జయపురం మున్సిపాలిటీ స్థాయి రాష్ట్రీయ ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ – 2025 ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక వల్లభ నారాయణ మందిరంలో పర్వ్ మశాలా(దివిటీ) వెలిగించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి మశాల స్వీకరించగా ఊరేగింపు ప్రారంభమైంది. కార్యక్రమంలో జయపురం విక్రమదేవ్ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్, మున్సిపాలిటీ కార్య నిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బి.సునీత, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
– జయపురం
ఉత్సాహంగా కొరాపుట్ పర్వ్
ఉత్సాహంగా కొరాపుట్ పర్వ్
ఉత్సాహంగా కొరాపుట్ పర్వ్


