41 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం:
జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడలో గల సహిద్ లక్ష్మణ నాయిక్ కళాశాలలో కళాశాల యాజమాన్యం ద్వారా సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్, యువ రెడ్ క్రాస్ సొసైటీ, బొయిపరిగుడ రెడ్ రిబన్ క్లబ్, సంబాద్ అమొ ఒడిశాలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కళాశాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మహాపాత్రో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా బొయిపరిగుడ రెడ్ రిబ్బన్ క్లబ్ ఉపాధ్యక్షుడు పూర్ణియ బారిక్, బొయిపరిగుడ సమితి సభ్యులు మంజులత పట్నాయిక్, సునీల్ మహాపాత్రో తదితరులు రక్తదాతలను ఉత్సాహపరిచారు. శిబిరంలో 41 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రక్తదాన శిబిరంలో లక్ష్మణ నాయిక్ కళాశాల ప్రిన్స్‌పాల్ స్నేహలత పట్నాయిక్, వై.ఆర్.సి జ్యోతి పాఢి, కళాశాల ఎన్.ఎస్.ఎస్ కేడర్ ప్రతినిధి హిమాంశు శేఖర బక్షీ, అధ్యాపకులు మౌసుమీ మహంతి, క్షీరోద్ కుమార్ పాయిక్, సను పొరజ, రాకేష్ భుయ, బొయిపరిగుడ సంబాద్ ప్రతినిధి అమరేంధ్ర కుమార్ పరిచ,సమాజ సేవి సౌమేంధ్ర పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
41 యూనిట్ల రక్తం సేకరణ
41 యూనిట్ల రక్తం సేకరణ


