8 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
మల్కన్‌గిరి:
మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కుర్మానూర్ పంచాయతీ ప్రాంతంలో ఎనిమిది ఎకరాల్లో గంజాయి తోటలను కలిమెల పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. 12 వేల గంజాయి మొక్కలను పెకలించి నాశనం చేశారు. దీని విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వరి కోతలు సీజన్ కావడంతో గంజాయి సాగును కూడా గిరిజనులు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా నేతృత్వంలో ఎస్‌ఐ డోంబును సుగ్రీ సహ పోలీసు బృందం కుర్మానుర్ ఘాటీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గంజాయి తోట కనిపించడంతో వెంటనే నరికి కాల్చి ధ్వంసం చేశారు. గంజాయి వనాలపై విస్తృతంగా దాడులు చేపడతామని ఐఐసీ ముకుందో మేల్కా తెలిపారు. గంజాయి సాగు ఎవరికి చెందిందో దర్యాప్తులో తేలుతోందన్నారు.


