సాంకేతిక పరిజ్ఞానంతో బోధన పటిష్టం
భువనేశ్వర్: ఉత్తమ విద్యాభ్యాసం ఉన్నత జీవితం ప్రామాణికం. విద్యార్థులకు పటిమతో కూడిన విద్యా బోధన, సాధన కల్పించడంలో ఉపాధ్యాయులు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దక్షతకు నిరంతరం పదును పెట్టాలని హైటెక్ గ్రూప్ విద్యా సంస్థల సీఈఓ, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి ప్రబోధించారు. బోధన, సాధనపై విద్యార్థులను ఉత్సాహపరచడంలో ఉపాధ్యాయులు చురుకుగా ముందుకు సాగాలని, ఈ రంగంలో కాలానుగుణ సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధ్యాయ వర్గం సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. జెట్నీ కోణార్క్ విజ్ఞాన, సాంకేతిక కళాశాల (కిస్ట్)లో నిర్వహించిన 5 రోజుల వర్క్‌షాప్ ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. కోల్‌కతా సాంకేతిక విద్య ఉపాధ్యాయుల పరిశోధన సంస్థ (ఎన్‌ఐటీఈటీఆర్) సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయుల ముందస్తు తయారీ, విద్యార్థులను విద్య వైపు ఆకర్షించడానికి సరైన నైపుణ్యాల గురించి వర్క్‌షాప్ చర్చించింది. ఏఐసీటీఈ అనుబంధంగా ఉన్న విద్యా సంస్థల నుంచి వందలాది మంది ఉపాధ్యాయులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ శిబిరంలో పాల్గొన్నారు. విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తయారు చేయడంలో అంకిత భావంతో కృషి చేయాలని అభ్యర్థించారు. దేశం కోసం జ్ఞానవంతమైన విద్యార్థులను తయారు చేయడంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ దిశలో హైటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి చేసిన బలమైన ప్రయత్నాలు ఫలించడం ప్రారంభించాయి. ఐదు రోజుల పాటు వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించిన వారికి కిస్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్ పాణిగ్రాహి అభినందించారు.


