దుకాణంలోకి దూసుకెళ్లిన పికప్ వ్యాన్
రాయగడ:
పశువులను తరలిస్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపు తప్పి దుకాణంలోకి దూసుకువెళ్లిన ఘటన జిల్లాలొని బిసంకటక్ లొ ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలొ దుఖానంలొ కూర్చున్న ఒక మహిళ తీవ్రగాయాలకు గురైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని పికప్ వ్యాన్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాయాలకు గురైన మహిళలను హస్పటల్ కు తరలించి చికిత్స అందించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... మునిగుడ నుండి ఆంధ్రప్రదేశ్ వైపు అయిదు పశువలతొ ఒక పికప్ వ్యాన్ వెళుతుండగా బిసంకటక్ క్రిష్టియన్ హస్పటల్ మలుపువద్ద అదుపుతప్పి రొడ్డు పక్కనే ఉన్న ఒక దుఖాణంలొకి దూసుకువెళ్లింది. దుఖానంలొ కూర్చున్న జిత్తు నల్లా అనే వ్యక్తి భార్య భారతీ నల్లా గాయాలకు గురైంది. దీంతో డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దుకాణంలోకి దూసుకెళ్లిన పికప్ వ్యాన్


