కుమ్ములుసింగి గ్రీవెన్స్‌లో 88 వినతులు స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ కుమ్ములుసింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్‌ను ఉన్నతాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయఘడ బ్లాక్‌లోని సన్నతుండి, మర్లబ, కుమ్ములుసింగి ప్రజలు తరలివచ్చారు. ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, ఆదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహాంతి, ఆదనపు అభివృద్ధి అధికారి, జెడ్పీ ఈవో పృధ్విరాజ్ మండళ్, తదితరులు హాజరయ్యారు. నాలుగు పంచాయతీల నుంచి 88 వినతులు అందగా, వాటిలో 37 వ్యక్తిగతం, గ్రామసమస్యలకు సంబంధించినవి 51 ఉన్నాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సామాజిక సురక్షా, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఐదుగురికి పింఛన్ కార్డులు మంజూరుచేసి అందజేశారు. రాయఘడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం. ఆలీ, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
చంద్రపూర్‌లో 45 వినతులు..
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి చంద్రపూర్ సమితి కార్యాలయ సమావేశం హాల్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 45 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 26 వ్యక్తిగతం కాగా 19 గ్రామ సమస్యలుగా గుర్తించారు. కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అక్షయ కుమార్ ఖెముండో, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.సరోజినిదేవి, చంద్రపూర్ బీడీవో సౌమ్య కాంత్ బంగ్లా, తహసీల్దార్ సునీల్ కుమార్ ప్రధాన్‌పాల్గొన్నారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలక్టర్ నాయక్ ఆదేశించారు.
చిత్రకొండ సమితిలో 393 వినతుల స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి పప్పులూర్ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 393 వినతులు అందాయి. వీటిలో 256 వ్యక్తిగత వినతులు ఉండగా.. మిగిలిన 137 సామూహిక సమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. అలాగే సంక్షేమ పథకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బంసుదరా పథకంగా భాగంగా 59 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలను, 59 మందికి శ్రామిక కార్డులు అందజేశారు. సంక్షేమ పథకాల కోసం ఆరుగురు పేర్లు నమోదు చేసుకున్నారు. 8 మందికి కొత్త కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, చిత్రకొండ సమితి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
కుమ్ములుసింగి గ్రీవెన్స్‌లో 88 వినతులు స్వీకరణ
కుమ్ములుసింగి గ్రీవెన్స్‌లో 88 వినతులు స్వీకరణ
కుమ్ములుసింగి గ్రీవెన్స్‌లో 88 వినతులు స్వీకరణ
కుమ్ములుసింగి గ్రీవెన్స్‌లో 88 వినతులు స్వీకరణ


