ఏక్తా పాదయాత్ర
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిధిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన ఏక్తా పాదయాత్రలో నవరంగ్‌పూర్ ఎంపీ బోలభద్ర మాఝి పాల్గొని పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఒకే భారత్, శ్రేష్ట భారత్‌కు ప్రతీక అని అన్నారు. దేశభక్తుడు, జాతీయతావాది, అఖండ భారత నిర్మణంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. జిల్లా పరిపాలన అధ్వర్యంలో స్థానిక ఎం.వి.3 గ్రామం వద్ద గల బీఎస్‌ఎఫ్ గ్రౌండ్ నుంచి డీఎన్‌కే క్రీడా మైదానం వరకు ఈ ఏక్తా పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, బీఎస్‌ఎఫ్ డిప్యూటీ కమెండార్ రవి మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రదాన్, డీఐపీఆర్ ప్రమిళా మాఝి, అధికారులు, జవాన్‌లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏక్తా పాదయాత్ర


