ఉత్సాహంగా క్రీడోత్సవాలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ గాంధీ పబ్లిక్ స్కూల్‌లో సోమవారం వార్షిక క్రీడోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర పండ ముఖ్యఅతిథిగా హాజరై క్రీతోత్సవాలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను కనబరిచేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో మనోవికాసానికి క్రీడలు సహకరిస్తాయని అన్నారు. మూడు రోజులు పోటీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. నర్సరీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు పోటీలు విభాగాల వారీగా జరుగుతున్నాయి. ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


