
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
పర్లాకిమిడి: ఒడిశా రెవెన్యూ అమలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో సోమవారం నిరసన చేపట్టారు. జూన్ 25న ఒడిశా రెవెన్యూ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం గజపతిలో సంఘం కార్యదర్శి సంతును మిశ్రా నేతృత్వంలో 10 అపరిష్కృత డిమాండ్లను నెరవేర్చాలని అప్పటివరకూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్లను 15 రోజుల్లోగా ప్రభుత్వం పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెలోకి దిగుతామని సంతును మిశ్రా తెలిపారు. ఒడిశా రెవెన్యూ ఉద్యోగులకు బేసిక్ పే 9 లెవల్‌కు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులకు స్వస్థ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, పాత పింఛను అమలుచేయాలని, 1990లో జీఓ ప్రకారం ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం విధివశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మంజూరు చేయాలని కోరారు. పదోన్నత లు, జూనియర్ అసిస్టెంటు అర్హత ప్రస్తుత డిగ్రీ నుంచి ఇంటర్‌కు మార్చాలని కోరారు.