
రాయగడలో వన మహోత్సవం
రాయగడ: అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక భారిజోల సమీపంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. గౌరవ అతిథులుగా జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝిలు హాజరయ్యారు. అనంతరం హనుమాన్ మందిరం ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. నవజీవన్ ట్రస్టు ఆశ్రమంలోని విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడ్రక మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యానికి మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ పట్వారి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమ్మపేరుతొ ఒక చెట్టు అనే సందేశంతో ప్రారంభమైన వనమహోత్సవంలో విద్యార్థులు చురుగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పర్యావరణంపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్‌వో వారు తమ పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలకు నాంది పలుకుతారన్నారు. డీఎఫ్‌వో అన్నా సాహేబ్ అహలే, రేంజర్ కామేశ్వర్ ఆచారి కార్యక్రమాన్ని పరివేక్షించారు.

రాయగడలో వన మహోత్సవం