
భక్తిశ్రద్ధలతో బహుడా
తొమ్మిది రోజుల పాటు గుండిచా మందిరంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన జగన్నాథుడు సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి శనివారం తిరిగి మందిరానికి బయల్దేరాడు. దీనినే మారు రథయాత్ర(బహుడా)గా పిలుస్తారు. గండిచా మందిరంలోని దేవతామూర్తులను రథంపైకి ఎక్కించి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాలు లాక్కొని వెళ్లారు. దేవతామూర్తుల రథాలు సాంప్రదాయం ప్రకారం మార్గమధ్యలోని తమ పిన్ని ఇంటి వద్ద ఆగాయి. అక్కడ దేవతామూర్తులు ఏకాదశి పురస్కరించుకొని ఆదివారం విడిది చేస్తారు. భక్తుల పూజలందుకున్న అనంతరం ప్రధాన మందిరానికి రథాలు బయల్దేరుతాయి.
– సాక్షి నెట్‌వర్క్