
రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి
–8లోu
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
నృత్యాలు చేస్తున్న కళాకారులు
శ్రీమందిరం సింహద్వారం వద్దకు చేరిన రథాలు
పూరీ శ్రీజగన్నాథుని మారు రథయాత్ర బహుడా సందర్భంగా సాగర తీరంలో సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ సైకత శుభాకాంక్షలు
భువనేవ్వర్: శ్రీజగన్నాథుని రథయాత్ర ద్వితీయ ఘట్టం బహుడా అత్యంత భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. అధికారులు, సేవాయత్ వర్గాల మధ్య సమన్వయంతో యాత్ర పూజాదులు నిర్ధారిత వేళ కంటే ముందుగా పూర్తి చేయడంతో అడప మండపం నుంచి వరుస క్రమంలో రథాలపైకి మూలవిరాటుల తరలింపు పొహండి ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మూల విరాటులు తరలి వస్తుండగా శారదా బాలి ప్రాంగణం శంఖ ధ్వని, ఘంటానాదంతో మారుమోగింది. భక్తుల జైజగన్నాథ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. ఔత్సాహిక కళాకారులు భక్తిశ్రద్ధలతో రథాల ఆవరణలో శాసీ్త్రయంగా నృత్యం ప్రదర్శించి భక్తజనం దృష్టిని ఆకట్టుకున్నారు.
ఆసీనులైన దేవతామూర్తులు
తొలుత చక్రరాజ్ సుదర్శనుడు గుండిచా ఆలయం అడప మండపం నుంచి తరలివచ్చి దేవీ సుభద్ర రథం దర్ప దళనంపై ఆసీనుడయ్యాడు. వెంబడి తాళధ్వజంపైకి బలభద్రుని మూలవిరాటు చేరింది. దేవీ సుభద్ర దర్ప దళనంపైకి చేరడంతో, చివరగా శ్రీజగన్నాథుడు నందిఘోష్ రథంపై ఆసీనుడు అయ్యాడు. వెంబడి మూలవిరాటుల ఉత్సవమూర్తులను రథాలపైకి వరుస క్రమంలో తరలించడంతో పొహండి ముగిసింది. ఉదయం 9.55 గంటలకు ప్రారంభమైన పొహండి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిసింది. అంతకు ముందు మంగళ హారతి, మైలం వంటి అనేక ఆచారబద్ధమైన పూజలు, సేవాదులు నిర్వహించారు. మూల విరాటులు రథాలపై ఆసీనులు కావడంతో పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ చెర పహార కార్యక్రమంలో పాల్గొని 3 రథాలను శుద్ధి చేశారు. అనంతరం రథాల మారుయాత్ర ప్రారంభమైంది.
మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభం
తొలుత బలభద్రుని తాళధ్వజం మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరింది. వాస్తవానికి రథాలు లాగడం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబడుతుందని ప్రకటించారు. ఆ తర్వాత దేవి సుభద్ర దర్ప దళనం యాత్ర ప్రారంభించింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం దారి పొడవునా ఆత్మీయుల్ని పలకరించుకుంటూ నిదానంగా శ్రీమందిరం గమ్యం చేరింది. దారిలో బాలగండి చౌరస్తా ప్రాంతంలో మౌసీ మా (పిన్నమ్మ) ఆలయం ఆవరణలో నందిఘోష్ రథం ఆనవాయితీ ప్రకారం కాసేపు ఆగింది. యాత్ర ముగించుకుని శ్రీమందిరానికి చేరబోతున్న జగతినాథునికి పిన్నమ్మ ప్రేమతో తయారు చేసిన తీపి వంటకం పొడొ పిఠా మట్టి పాత్రలో నివేదించింది. ఏటా మారు రథయాత్ర ముందు రోజున మౌసీ మా ఆలయంలో ఈ వంటకం సిద్ధం చేస్తారు. ఈ సాంప్రదాయ ఒడియా రుచికరమైన వంటకం గోధుమ పిండి, చెన్నా (విరిగిన పాలు), చక్కెర, పిస్తాపప్పులు, ఏలకులు, లవంగాలు మరియు శుద్ధ నెయ్యిల గొప్ప మిశ్రమంతో తయారై ఘుమఘుమలాడుతు రుచికరంగా ఉంటుంది. మౌసీ మా ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీ జగన్నాథుని రథం మరోమారు గజపతి మహారాజా భవంతి ఆవరణలో ఆగింది. అన్నాచెల్లెళ్లతో యాత్రకు వెళ్లి తనను ఒంటరి చేశారన్న మనస్తాపంతో కలత చెందుతున్న శ్రీమహాలక్ష్మీ దేవిని బుజ్జగించి నచ్చజెప్పడంలో గజపతి మహారాజా రాయబారిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ముచ్చట గొలిపే లక్ష్మీనారాయణుల భేటీ అత్యంత భక్తిశ్రద్ధలతో భక్త జన సంద్రం సమక్షంలో జరిగి యాత్రలో ఆకర్షణీయ ఘట్టంగా నిలిచిపోతుంది.
● మంత్రి సూర్యవంశీ సూరజ్
న్యూస్‌రీల్
ఎట్టకేలకు..!
కొరాపుట్ – జయపూర్ మార్గంలో కదిలిన రైలు

రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి

రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి

రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి

రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి

రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి