
జయపూర్ యువరాజుకి గిరిజనుల కానుకలు
కొరాపుట్: జయపూర్ రాజా నగర్‌లోని మోతిమహల్ కి నందపూర్ నుంచి గిరిజనులు తరలి వచ్చారు. యువరాజు విశ్వేశ్వర చంద్ర చుడ్ దేవ్‌కి అటవీ ఉత్పత్తులు బహూకరించారు. తలపాగా కట్టి రాజరిక గౌరవం చేశారు. యువరాజు చంద్ర చుడ్ ఇటీవల నందపూర్ రథయాత్రలో రథ నిర్మాణం కోసం రు.లక్ష విరాళం పంపించారు. అక్కడ జగన్నాథ పూజా కమిటీకి చెందిన ప్రదీప్ దాస్, జగన్నాఽథ్ పంగి, కాశీనాథ్, భువనేశ్వర్ దళపతి, అజయ్ ఖెముండు తదితరులు వచ్చి ప్రసాదాలు అందిచారు. అనేక దశాబ్దాలుగా మోతీ మహల్ తలుపులు తెరవలేదు. ప్రస్తుత యువరాజు చంద్ర చుడ్ దేవ్ అలహాబాద్‌లో బాల్యం గడిపి ఇటీవలే జయపూర్ సంస్థానానికి తిరిగి వచ్చారు. తమ వంశీయుల సంప్రదాయాలు కొనసాగించడానికి ప్రజలకు సహాయ సహాకారాలు ప్రారంభించారు. ఇటీవలే ఆంధ్రా యూనివర్సిటీకి రు.లక్ష పంపించారు.