
సమ్మెను జయప్రదం చేయండి
పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల తొమ్మిదో తేదీన చేపట్టనున్న హర్తాల్‌ను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శ్రామిక వర్గం, వ్యవసాయ, యువజన, విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగా ప్రభుత్వలు అనుసరిస్తున్నట్టు చెప్పారు. దీనికి నిరసనగా రాష్ట్రంలో చేపట్టనున్నసమ్మెకు అన్ని ట్రేడ్ యూనియన్లు, గజపతి మోటారు వర్కర్సు కర్మచారి సంఘాలు, ఆశ, అంగన్‌వాడీ, మిషన్ శక్తి సాథీలు, జీవికా మిషన్‌లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్లకిమిడిలోని దండుమాలవీఽధిలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ట్రేడ్ యూనియన్ల జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గజపతి జిల్లా మోటారు కర్మచారి సంఘం, ఆశవర్కర్లు, ఉద్యానవనాల సాథీలు, పాచికా సహాయకులు, గ్రామపంచాయతీ ఉద్యోగులతో సహా మిషన్ శక్తి, జీవికా మిషన్ అధ్యక్షురాలు సస్మితా బోడోరయితో, జిల్లా కోఆర్డినేటరు నర్సింహా మాలబిశోయి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ల సంపాదకులు జయంత్ దాస్ పాల్గొన్నారు.