
ఘనంగా విక్రమదేవ్ వర్మ జయంతి
జయపురం: జయపురం మహారాజు రాజర్శి స్వర్గీయ విక్రమదేవ్ వర్మ 157వ జయంతిని జయపురంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్‌ఆర్‌మాల్ సభాగృహంలో జయపురం సాహిత్య పరిషత్, ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విక్రమదేవ్ వర్మ చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజళి ఘటించి జయంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షులు హరిహర కరసుధా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోఒడిశా సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ సురేంద్రనాథ్ దాస్ ముఖ్యవక్తగా పాల్గొని సామ్రాట్ విక్రమదేవ్ సాహితీ రంగానికి అందించిన సేవలు వివరించారు. సమావేశంలో గాయిత్రీ పాణిగ్రహి రచించిన స్మృతి పకుడ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాహితీవేత్త బంగాళీ నందోను విక్రమదేవ్ సమ్మాన్ 2025 తోను, ప్రొఫెసర్ సత్యనారాయణ రథ్‌ను, జయపురం సాహిత్య పరిషత్ సమ్మాన్‌తోను సన్మాణించారు. కార్యక్రమంలో కొరాపుట్ కోట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ రథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరేష్ రథ్, సాహిత్య పరిశోధకులు శ్రీరంగ నాయిక్, జయపురం సాహిత్య పరిషత్ కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి, పలువురు రచయితలు, సాహిత్యకులు పాల్గొన్నారు.
విక్రమదేవ్ జయంతి సభలో పాల్గొన్న ప్రముఖులు

ఘనంగా విక్రమదేవ్ వర్మ జయంతి