
● కన్నీటి వీడ్కోలు!
కొరాపుట్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి ఒకే చోట దహన సంస్కారాలు శనివారం నిర్వహించారు. చితిమంటలు ఎగసి పడుతుంటే కుటుంబ సభ్యులు కన్నీట పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం గ్రామానికి చెందిన చంపక్ లాల్ జైన్ కుమారుడు సాగర్ జైన్ (21), మహావీర్ జైన్ కుమారుడు అంకుర్ జైన్ (18), మన్ మెహన్ జైన్ కుమారుడు క్రిష్ జైన్ (22) కారు ప్రమాదంలో శుక్రవారం వేకువ జామున మృతి చెందారు. వీరి మృతదేహాలను జొరిగాం పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులందరు తమ తండ్రులకు ఒకే మగ సంతానం. అంతేకాక ఇద్దరు తండ్రులు అన్నదమ్ములు, మరో మృతుడు కూడా ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తే. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. దీంతో ముగ్గురు మృతదేహాలకు శనివారం జొరిగాం గ్రామంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్ర బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ముగ్గురు మృతికి సంతాపంగా జొరిగాంలో వర్తక వాణిజ్య సంస్థలను మూసివేశారు.
ఒకే కుటుంబానికి చెందిన మూడు మృతదేహాలకు ఒకేసారి దహ న
సంస్కారాలు

● కన్నీటి వీడ్కోలు!

● కన్నీటి వీడ్కోలు!