
చేయి చేయి కలిపి రోడ్డు నిర్మించి..
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి జంగపాడు గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. చేయి చేయి కలిపి శ్రమదానంతో ఏకంగా రోడ్డును నిర్మించుకొని కష్టాలను తీర్చుకున్నారు. ఈ గ్రామానికి సరైన రహదారి లేకపొవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. దీంతో శ్రమదానం చేసి రోడ్డు నిర్మించుకోవాలని భావించి ఆలోచనను ఆచరణలో చేసి చూపించారు. రెండేళ్ల క్రితం సమితిలోని చాటికొన నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల జంగపాడు గ్రామానికి రహదారి నిర్మించేందుకు సంబంధిత శాఖ టెండర్లను ఆహ్వానించింది. టెండరు ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంతవరకు నిర్మాణం పనులు చేపట్టలేదు. అత్యవసర పరిస్థితిలో రాకపోకలకు చాలా కష్టంగా మారింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపొవడంతో శ్రమదానం చేసుకుని మట్టి రోడ్డును నిర్మించుకున్నారు. చిన్నా,పెద్ద అంతా తలో చేయి వేసి పనులను పూర్తి చేసుకున్నారు. రెండు రోజుల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పొడువున రహదారిని నిర్మించుకున్న గ్రామస్తులు సొమవారం నాటికి పూర్తిస్థాయి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వచ్చేది వర్షాకాలం కావడంతో మట్టితో నిర్మించుకున్న రహదారి కొట్టుకుపొతే పరిస్థితి యథాస్థితికి చేరుతుందని ఆందోళన చెందుతున్ననుర. ఏదిఏమైప్పటికీ ప్రస్తుతం వాహన రాకపొకలకు మార్గం సుగమమం కావడంతో ఆనందిస్తున్నారు. అధికారులు ఇప్పటికై న స్పందించి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
ఆదర్శంగా నిలిచిన జంగపాడు
గ్రామస్తులు
రెండురోజుల్లో నాలుగు కిలోమీటర్ల రోడ్డును నిర్మించుకున్న వైనం