
రైలు పట్టాలపై వెంకటస్వామి మృతదేహం
జయపురం: మిషన్ మిల్లెట్ కార్యక్రమంలో భాగంగా జయపురం ప్రకాశ విద్యాలయం ఎన్‌సీసీ క్యాడెట్లు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యాలయం వద్ద ప్రిన్సిపాల్ కృష్ణ నిశంకో, వైస్ ప్రిన్సిపాల్ పి.సుకుమార్ పతాకాన్ని ఊపి ర్యాలీని ప్రారంభించగా.. బైపాస్ రోడ్డు, మహాత్మాగాంధీ కూడలి, 26వ జాతీయ రహదారి మీదుగా విక్రమదేవ్ స్వయంపాలిత కళాశాలకు వెళ్లారు. అక్కడ ఎన్‌సీసీ కమాండెంట్ డాక్టర్ లక్ష్మణపాత్రొ మిషన్ మిల్లెట్ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆహారంలో మిల్లెట్లు(చిరుధాన్యాలు) వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తిరుగు మార్గంలో లక్ష్మీపండా కూడలి, జయనగర్, పంచానన మందిరం, తరణి చక్, పవర్‌హౌస్ కాలనీ మీదుగా విద్యాలయానికి చేరుకున్నారు.
కూష్మాండ స్వరూపంలో జగులైమాత
భువనేశ్వర్: ఖుర్దారోడ్ కుదియారి గ్రామదేవత వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సంధ్యవేళలో మహా స్నానం అనంతరం చిత్రకార్ సేవకుడు బిజయ్‌కుమార్ పండా అమ్మవారికి ఈ అలంకరణ చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ పారాయణం, షోడశోపచార పూజలు నిర్వహించారు.
మూడు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధి ముధిలిపొడ గ్రామంలో ఎకై ్సజ్ పోలీసులు 3 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముదిలిపొడ గ్రామంలో వేణు హంతాల్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా గంజాయి నిల్వ చేసినట్లు సమాచారం అందింది. ఈ మేరకు మల్కన్‌గిరి ఎకై ్సజ్ పోలీసులు దాడిచేయగా, 364 కిలోల సరుకు పట్టుబడింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే బలిమెల రహదారిలో బైక్‌పై తరలిస్తున్న 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నితాయ్ పర్మానిక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి. శనివారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తామని ఎకై ్సజ్ ఎస్‌ఐ ఉదయ్‌లాల్ నాయిక్ తేలిపారు. దాడుల్లో సిబ్బంది ఆశిష్‌కుమార్ నాయక్, దీపక్ సమాల్, చిత్రకొండ ఎకై ్సజ్ ఎస్‌ఐ కుమార్ జెనా, రామచంద్ర హంతాల్, ప్రమోద్ పాత్రొ తదితరులు పాల్గొన్నారు.
పలాస రైల్వేస్టేషన్‌లో
వృద్ధుడి మృతి
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం నంబర్–2లో వృద్ధుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు విచారణ జరపగా సోంపేట మండలం పొత్రకండ గ్రామానికి చెందిన గోకర్ల వెంకటస్వామి(70)గా గుర్తించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జీఆర్‌పీ ఎస్‌ఐ షరీఫ్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.
పక్కుడుభద్రలో ఏనుగులు
భామిని: మండలంలోని పక్కుడుభద్రలో ఆరు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కాట్రగడ–బి వద్ద ఏబీ రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్న పంటను నాశనం చేశాయి. అనంతరం పక్కుడు భద్ర వద్ద జీడితోటల్లోకి చేరాయి. అటువైపుగా ఉపాధిహామీ పనుల కోసం వెళ్లిన వేతనదారులు ఏనుగులను చూసి పరుగుతీశారు.

కూష్మాండ అలంకారంలో కుదియారి గ్రామదేవత జగులైమాత

సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లు

ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలు