శ్రీరామనవమి కల్యాణానికి పవిత్ర గోటి తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీరామనవమి కల్యాణానికి పవిత్ర గోటి తలంబ్రాలు

Mar 24 2023 5:48 AM | Updated on Mar 24 2023 5:48 AM

సమావేశంలో మాట్లాడుతున్న  
డాక్టర్‌ రామేశ్వరి ప్రభు 
 - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ రామేశ్వరి ప్రభు

నెల్లిమర్ల రూరల్‌: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 30న జరగబోయే శ్రీరామనవమి కల్యాణానికి గోటితో తొలచిన కోటి తలంబ్రా లు సిద్ధమయ్యాయి. రామతీర్ధం సేవా సంఘం ఆధ్వర్యంలో సిద్ధం చేసిన గోటి తలంబ్రాలను 2017 నుంచి శ్రీరాముడి కల్యాణానికి అర్చకు లు వినియోగిస్తున్నారు. ఏపీతో పాటు తెలంగా ణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు ప్రత్యేకంగా సేద్యం చేసిన ధాన్యాన్ని గోటితో తొలిచి తలంబ్రాలుగా మార్చారు. సిద్ధం చేసిన తలంబ్రాలను రామతీర్థం సేవా సంఘం ప్రతినిధులకు రామ భక్తులు పంపించా రు. పవిత్ర తలంబ్రాలను శ్రీరామనవమి రోజున నిర్వహించబోయే స్వామి కల్యాణంలో తలంబ్రాల సేవకు అర్చకులు వినియోగిస్తారని విజయ్‌కుమార్‌ తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం పూల్‌బాగ్‌: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6, ఇంటర్‌లో ప్రవేశం కోసం, అలాగే 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికిగానూ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 20 వర కు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. అనాథలు, డ్రాపౌట్స్‌ (బడి మానేసిన వారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్‌ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆన్లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్‌ కోసం పరిగణిస్తామని చెప్పారు. దరఖాస్తును హెచ్‌ టీటీపీఎస్‌://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌. ఐఎన్‌ సైట్‌ ద్వారా పొందవచ్చునన్నారు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే 90002 04925 నంబరుకు సంప్రదించాలని కోరారు.

ప్రజా భాగస్వామ్యంతోనే

క్షయ నివారణ

విజయనగరం ఫోర్ట్‌: ప్రజల భాగస్వామ్యంతోనే క్షయ వ్యాధిని నియంత్రించడం సాధ్యపడుతుందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రామేశ్వరి ప్రభు అన్నారు. జిల్లా క్షయ నివారణ శాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు తదితర చోట్ల ప్రత్యేక శిబిరాలు నిర్వహించి క్షయ వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించామని చెప్పారు. 2025 నాటికి క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తీసుకుంటున్న చర్యలు ఫలితంగా జిల్లాలో క్షయ వ్యాధి వ్యాప్తి తగ్గుతుందన్నారు. జిల్లాలో గత నాలుగేళ్లుగా క్షయ వ్యాధి 20 శాతం మేర తగ్గిందన్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఒక నోడల్‌ అధికారిని, అవసరమైన మేరకు మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. క్షయ రోగుల్లో మనో ధైర్యాన్ని నింపుతున్నామని తెలిపారు. 64 మంది క్షయ మిత్రల సహాయంతో 518 క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నామని తెలిపా రు. వారికి మందులు, ఉచిత ఆహార కిట్లును అందిస్తున్నామన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం ఉదయం పట్టణంలో అవగాహన ర్యాలీతో పాటు సంతపేట యూపీహెచ్‌సీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలను అందజేస్తామన్నారు.

ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

పాచిపెంట: మండలంలోని పి.కోనవలస జాతీయ రహదారిపై దుర్గగుడి సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మెదుగు పంచాయతీ పర్తాపురం గ్రామానికి చెందిన గన్నేలబోయిన గుండు, సన్యాసి, చంద్రమ్మ, సోను అనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బుధవారం ఆటోలో పాచిపెంటలో జరిగిన నూకాలమ్మ జాతరకు వచ్చి తిరిగి పర్తాపురం వెళ్తుండగా పి.కోనవలస జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108 సహాయంతో వారిని సాలూరు సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుల్లో గన్నేలబోయిన గుండు పరిస్ధితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు ఏఎస్సై ముసలయ్య తెలిపారు.

కుక్కల దాడిలో మహిళకు గాయాలు

రాజాం సిటీ: మండల పరిధి పెనుబాక గ్రామంలో కుక్కలు దాడిచేయడంతో గ్రామానికి చెందిన తాడేల ఈశ్వరమ్మ గాయాలపాలైంది. గురువారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమైపె ఒక్కసారిగా కుక్కలు దాడిచేశాయి. ఈ దాడిలో ఆమె కాలికి గాయం కావడాన్ని స్థానికులు గమనించి కుక్కలను చెదరగొట్టిన అనంతరం ఆమెను ఆటోలో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement