
విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
చందర్లపాడు(నందిగామ టౌన్): విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన చందర్లపాడు గ్రామంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు గ్రామానికి చెందిన బూతుకూరి గోపాలరెడ్డి (37) రోజూ మాదిరిగా శుక్రవారం కూలి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలంలో ట్రాక్టర్‌లోని పసుపు కొమ్ముల లోడు దిగుమతి చేస్తుండగా ఒక్క సారిగా 33 కేవీ విద్యుత్ వైర్లను తాకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరా లు సేకరించి మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే నివాళులు..
చందర్లపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన గోపాలరెడ్డి మృతదేహాన్ని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముక్కపాటి నరసింహారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌ఎన్ ప్రసాద్, వెలగపూడి వెంకటేశ్వరరావు, కోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన
మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహనరావు