
యాజమాన్యాలపై వస్త్ర వ్యాపారుల ఫిర్యాదు
పాఠశాలలు అక్రమంగా దుస్తుల విక్రయాలు జరుపుతున్నాయని వస్త్ర వ్యాపారులు సైతం అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కంచికచర్ల వస్త్ర వ్యాపారులు ఇటీవల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కలిసి పాఠశాలల్లో అత్యధిక ధరలకు పాఠశాల యూనిఫామ్ క్లాత్‌లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బయట తమ దుకాణాలు చాలా తక్కువకు విక్రయిస్తున్నా తమ వద్దనే కొనుగోలు చేయాలని పాఠశాలలు పట్టుబట్టి విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నాయని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలు జరుపుతున్న యూనిఫామ్‌ల అక్రమ వ్యాపారం వల్ల తమ విక్రయాలు పూర్తిగా పడిపోయాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొనటం విశేషం.